: కూచిపూడి నృత్యానికీ విభజన సెగ... తెలంగాణ స్థానికులకే 'కళాపీఠం' అనడంతో గందరగోళం


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వందలమంది భావి నాట్యాచార్యుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసింది. విభజనకు ముందు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠం, ఇకపై తమ పరిధిలో ఉండబోదని ఉత్తర్వులు వెలువరించింది. ఇక్కడ నాట్యం అభ్యసించాలనుకునే వారు తెలుగు విశ్వవిద్యాలయం, వరంగల్‌లోని కాకతీయ పీఠం ద్వారా అందుతున్న వివిధ కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలంటూ ప్రకటన వెలువరించడంతో నాట్యాచార్యుల్లో గందరగోళం నెలకొంది. ఉమ్మడి ఆస్తిగా పదేళ్ల పాటు వినియోగించుకోవాల్సిన విశ్వవిద్యాలయ విభాగాలను కేవలం తెలంగాణకే పరిమితం చేయడం ఏంటని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మండిపడుతున్నారు. ఈ విషయమై పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ మాసయ్య వివరణ ఇస్తూ, ఏపీ ప్రభుత్వం రాజమండ్రి లేదా మరో ప్రాంతం వేదికగా, కళాపీఠాలను నిర్వహించాల్సి వుందని తెలిపారు. కళాపీఠాన్ని తెలంగాణ స్థానికులకే పరిమితం చేయాలన్నది ప్రభుత్వ ఆదేశమని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న రెండు, మూడు సంవత్సరాల విద్యార్థుల భవిష్యత్తుపై పదిరోజుల్లో పరిష్కార మార్గం కనుగొంటామని సీఎం కేసీఆర్ వివరించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News