: రంగంలోకి ‘సత్యం’ కోడలు... ‘కాల్ హెల్త్’ పేరిట వినూత్న వ్యాపారానికి శ్రీకారం
భారత సాఫ్ట్ వేర్ రంగాన్ని భారీ కుదుపునకు గురి చేసిన సత్యం కంప్యూటర్స్ చైర్మన్ బైర్రాజు రామలింగరాజు గుర్తున్నారుగా? ‘సత్యం’ కేసులో దోషిగా తేలిన ఆయన దాదాపుగా వ్యాపారానికి దూరమయ్యారనే చెప్పాలి. అయితే ఆయన కుటుంబానికి ఒంటబట్టిన వినూత్న వ్యాపార మెళుకువలు మాత్రం అంత త్వరగా నీరుగారేలా లేవు. మరోసారి ఆయన కుటుంబం వినూత్న వ్యాపార మంత్రంతో రంగప్రవేశం చేసింది. రామలింగరాజు కోడలు సంధ్యారాజు ప్రమోటర్ గా ‘కాల్ హెల్త్’ అనే సంస్థ పురుడుపోసుకుంది. ఈఎంఆర్ఐ-108లో అత్యున్నత స్థానంలో పనిచేసిన సుధాకర్ సీవోవోగా, టెక్ మహీంద్రాలో కీలక పొజిషన్ లో పనిచేసిన హరి సీఈఓగా రంగ ప్రవేశం చేయనున్న ‘కాల్ హెల్త్’ ప్రధాన లక్ష్యం రోగులకు ఇంటి వద్దే చికిత్స అందించడమట. వచ్చే నెలాఖరు నుంచి సేవలు ప్రారంభించనున్న కాల్ హెల్త్ ప్రమోటర్ సంధ్యారాజే. చెన్నైకి చెందిన రామ్ కో గ్రూపు ప్రమోటర్ల కుటుంబానికి చెందిన సంధ్యారాజు, రామలింగరాజు కొడుకును వివాహం చేసుకుని ‘సత్యం’ కోడలుగా మారారు.