: 14 నెలల్లో ఏపీకి రూ.63 వేల కోట్ల కేటాయింపు... రూ.23 వేల కోట్లు విడుదల: లెక్కలు తీస్తున్న కేంద్రం


ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మునికోటి ఆత్మబలిదానం నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. ప్రతిపక్షం నుంచే కాక స్వపక్షం నుంచి కూడా ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ వినిపించింది. దీంతో ఏపీకి ఏదో ఒకటి చేయక తప్పని పరిస్థితి కేంద్రానికి ఎదురైంది. ఇందులో భాగంగా అసలు ఇప్పటిదాకా ఏపీకి తాను ఏమేం చేశానన్న విషయాలను బయటకు తీస్తోంది. గడచిన 14 నెలల కాలంలో ఏపీకి మొత్తం రూ.63,833.09 కోట్ల నిధులను కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తేల్చింది. అందులో రూ.23,843.21 కోట్లను ఇప్పటికే విడుదల చేశామని కూడా ఆ శాఖ లెక్కలు బయటకు తీసింది. ఈ నిధులు ఏటా రాష్ట్రానికి అందుతున్న పన్నుల వాటాకు అదనమని కూడా కేంద్రం చెబుతోంది.

  • Loading...

More Telugu News