: తెలంగాణ ‘గ్రామజ్యోతి’కి ‘శ్రీమంతుడి’ దన్ను... గ్రామాన్ని దత్తత తీసుకోనున్న ప్రిన్స్ మహేశ్


తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘గ్రామజ్యోతి’ పథకానికి దన్నుగా నిలిచేందుకు ‘శ్రీమంతుడు’ సంసిద్ధత వ్యక్తం చేశారు. తెలంగాణలోని ఏదేనీ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరిన తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రతిపాదనకు టాలీవుడ్ అగ్ర హీరో మహేశ్ బాబు సానుకూలంగా స్పందించారు. అత్యంత వెనుకబాటుకు గురైన పాలమూరు జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. సదరు గ్రామానికి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తానని మహేశ్ బాబు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన ఈ ఆసక్తికర అంశాన్ని పోస్ట్ చేశారు. 'గ్రామజ్యోతి'లో భాగంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ కోరిన మీదటే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని మహేశ్ బాబు ప్రకటించారు.

  • Loading...

More Telugu News