: పాక్ ఆటగాళ్లు ఆసిఫ్, బట్ పై నిషేధం ఎత్తివేసిన ఐసీసీ


అవినీతి వ్యవహారంలో నిషేధానికి గురైన పాకిస్థాన్ క్రికెట్ ఆటగాళ్లు మహ్మద్ ఆసిఫ్, సల్మాన్ బట్ పై ఐసీసీ నిషేధం ఎత్తివేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. వారిపై విధించిన నిషేధం సెప్టెంబరు 1 అర్ధరాత్రితో ముగుస్తుందని తెలిపింది. ఆ క్రికెటర్లు సెప్టెంబరు 2 నుంచి అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ ఆడేందుకు అర్హులని పేర్కొంది. ఇక, ఈ ఏడాది ఆరంభంలో పాక్ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు అనుమతించిన మహ్మద్ అమీర్ పై కూడా నిషేధం పూర్తి స్థాయిలో తొలగిపోతుందని, అతను కూడా అంతర్జాతీయ క్రికెట్ ఆడవచ్చని వివరించింది. 2010 ఆగస్టులో ఇంగ్లాండ్-పాకిస్థాన్ జట్ల మధ్య ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టులో ఈ ముగ్గురు ఆటగాళ్లు అవినీతికి పాల్పడ్డారంటూ స్వతంత్ర యాంటీ కరప్షన్ ట్రైబ్యునల్ తేల్చింది. కాగా, తమపై నిషేధం ఎత్తివేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించడంతో పాక్ ఆటగాళ్లు హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News