: సానియా అనుకూలవతి: షోయబ్ కితాబు


పాకిస్థాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ తన కెరీర్ ఊపందుకోవడానికి కారణం భార్య సానియా మీర్జానే అంటున్నాడు. ఓ ప్రొఫెషనల్ అథ్లెట్ గా కొనసాగేందుకు ఆమె కష్టించే విధానం, కెరీర్ పై చూపే అంకితభావం, సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని తాను కెరీర్ పునరుజ్జీవం దిశగా అడుగులేశానని చెప్పుకొచ్చాడు. సానియా ఎంతో అనుకూలవతి అని కొనియాడాడు. క్రికెట్ పర్యటనల్లో ఉన్నప్పుడు ఏవైనా సమస్యలు తోటి ఆటగాళ్లతో చెప్పుకోలేకపోతే, వాటిని సానియాతో పంచుకుంటానని, తద్వారా ఎంతో ప్రశాంతత లభిస్తుందని తెలిపాడు. పాకిస్థాన్ జట్టులోని తన పునరాగమనం సానియా అందించిన తోడ్పాటుతోనే సాధ్యమైందని షోయబ్ అంగీకరించాడు.

  • Loading...

More Telugu News