: ఒకే రోజు క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్న ముగ్గురు ఆటగాళ్లు


క్రికెట్ ప్రపంచంలో ఒకే రోజు పలువురు ఆటగాళ్లు గుడ్ బై చెప్పడం చాలా అరుదుగా జరుగుతుంది. ప్రస్తుతం అలాంటి సందర్భమే వచ్చింది. శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర, ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఐకాన్ మైఖేల్ క్లార్క్, ఆసీస్ ఓపెనర్ క్రిస్ రోజెర్స్ కెరీర్ కు వీడ్కోలు పలుకుతున్నారు. శ్రీలంక-టీమిండియా మధ్య జరిగే రెండో టెస్టే సంగక్కర కెరీర్ లో ఆఖరి మ్యాచ్ కాగా, ఆ పోరు ఆగస్టు 20 నుంచి 24 వరకు జరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో ఆసీస్-ఇంగ్లాండ్ మధ్య యాషెస్ ఐదో టెస్టు జరగనుంది. ఆ మ్యాచ్ తో క్లార్క్, రోజర్స్ ఆటకు వీడ్కోలు పలుకుతున్నారు. దాంతో, శ్రీలంక, ఆసీస్ జట్లలో భావోద్వేగాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అయితే, ఆయా టెస్టులు నిర్ణీత సమయాని కంటే ముందే ముగిసిపోతే ఆ ముగ్గురు క్రికెటర్ల రిటైర్మెంటు తేదీ కూడా కాస్త ముందుకు జరిగే అవకాశముంటుంది!

  • Loading...

More Telugu News