: విమానాశ్రయాల ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిన కేంద్రం


విమానాశ్రయాల ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. చెన్నై, కోల్ కతా, అహ్మదాబాద్, జైపూర్ విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని కేంద్రం విరమించుకుంది. అయితే, జైపూర్, అహ్మదాబాద్ విమానాశ్రయాల నిర్వహణను మాత్రం ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నారు. గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నాలుగు విమానాశ్రయాల ప్రైవేటీకరణను ప్రభుత్వం విరమించుకుందని విమానయాన శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ తెలిపారు.

  • Loading...

More Telugu News