: తిరుమలలో మళ్లీ విమానం కలకలం
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి విమానం కలకలం రేగింది. తిరుమల గగనతలంలో బుధవారం ఉదయం ఓ విమానం ప్రయాణించింది. పడమర దిక్కు నుంచి వచ్చిన ఆ విమానం తూర్పు దిశగా వెళ్లింది. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై విమానాలు తిరగడం నిషిద్ధం. శ్రీవారి ఆలయానికి సమీపం నుంచి విమానాలు వెళుతుండడం అటు టీటీడీని భద్రతా పరంగా ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతకుముందు కూడా పలుమార్లు విమానాలు శ్రీవారి ఆలయం పైనుంచి ప్రయాణించగా, టీటీడీ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చర్యలు తీసుకుంటామని చెప్పినా, తాజా ఉదంతంతో మరోసారి ఆందోళన తప్పలేదు.