: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి షాక్...తాగితే 10 వేలు... అమ్మితే 20 వేలు జరిమానా!


మద్యం అమ్మకాలు పెంచడంలో భాగంగా, చీప్ లిక్కర్ తయారీకి తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతున్న వేళ... సీఎం సొంత జిల్లాకు చెందిన ఓ గ్రామ ప్రజలు మద్యాన్ని నిషేధించారు. అంతటితో ఊరుకోకుండా తమ గ్రామంలో మద్యం తాగినా, మద్యం విక్రయించినా భారీ జరిమానా విధించాలని నిర్ణయించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని మీర్జాపల్లి గ్రామస్థులు మద్యాన్ని నిషేధించారు. గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయడంలో భాగంగా భారీ జరిమానాలు విధించేందుకు సిద్ధమయ్యారు. గ్రామంలో ఎవరైనా బహిరంగంగా మద్యం తాగినా, తాగి వచ్చి అల్లరి చేసినా 10 వేల రూపాయలు జరిమానా విధించాలని నిర్ణయించారు. అలాగే మద్యం విక్రయిస్తే 20 వేల రూపాయలు జరిమానా విధించాలని నిర్ణయించారు. 23 మంది మహిళలతో కూడిన మద్య నిషేధ కమిటీని కూడా నియమించారు. ఈ మేరకు తయారు చేసిన మధ్య నిషేధ ప్రమాణ పత్రంపై గ్రామస్థులు, కిరాణా షాపుల యజమానులు సంతకాలు చేశారు.

  • Loading...

More Telugu News