: భార్య అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటల్లోనే పనిలో నిమగ్నమైన ప్రణబ్ ముఖర్జీ


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అర్ధాంగి సువ్రా ముఖర్జీ అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడవగా, ఆమెకు ఇవాళ అంత్యక్రియలు నిర్వహించారు. తోడునీడగా ఉన్న భార్య గతించడం ఎవరికైనా బాధాకరమే! ఆ వేదన నుంచి కోలుకోవడానికి సమయం పడుతుంది. కానీ, దేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ మాత్రం బాధను మనసులోనే దాచుకున్నారు. భార్య అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే పనిలో నిమగ్నమయ్యారు. షెడ్యూల్ ప్రకారం మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు నివాళులర్పించారు. ఆపై ఆయనతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు మాట్లాడారు. గురువారం జరిగే భారత్, పసిఫిక్ దీవుల సహకార ఫోరం సదస్సు విషయమై వారు ప్రణబ్ తో చర్చించారు. గురువారం ఉదయం 14 పసిఫిక్ దీవుల నేతలకు రాష్ట్రపతి భవన్ వద్ద స్వాగతం పలకాలని వారు ఆయనకు వివరించారు.

  • Loading...

More Telugu News