: 1190 గురుకుల పాఠశాలలు కావాలని కోరాం: కడియం
1190 గురుకుల పాఠశాలలను తెలంగాణలో ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యాశాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్రం చేపట్టనున్న నూతన విద్యా విధానంపై చర్చించామన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల మధ్య అంతరం పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. బాలికా విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కేజీ టు పీజీ విద్యను 2016-17 విద్యా సంవత్సరంతో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.