: ఆన్ లైన్ వ్యాపారాదాయం నిమిషానికి 16 కోట్ల రూపాయలు
సోషల్ మీడియా ద్వారా ఈ-కామర్స్ సైట్ల వ్యాపారం జోరందుకుంటోంది. రోజురోజుకీ సామాజిక మాధ్యమాల జోరు పెరుగుతుండడంతో ఈ-కామర్స్ వ్యాపారం కూడా ఊపందుకుంటోందని సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఆన్ లైన్ వ్యాపారం ద్వారా ఈ కామర్స్ సైట్లు నిమిషానికి 16 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నాయి. ఇందులో 18.66 లక్షల ఆదాయం ఫేస్ బుక్, ట్విట్టర్, ప్రింటెస్ట్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతోందని సర్వే వెల్లడించింది. ఈ కామర్స్ వెబ్ సైట్ల ద్వారా నేరుగా జరిగే వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయానికి, సోషల్ మీడియా ద్వారా జరిగే వ్యాపారాదాయం అదనం అని సదరు సర్వే వెల్లడించింది. ఇది ఈ కామర్స్ వ్యాపారానికి మరింత సానుకూలాంశమని సర్వే పేర్కొంది.