: గాంధీ మార్గంలో నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేయడం అన్యాయం: వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి


స్వచ్ఛందంగా, గాంధీ మార్గంలో బంద్ చేస్తున్న ప్రజలను, నేతలను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. మహిళా ఎమ్మార్వోపై ఓ ఎమ్మెల్యే దాడి చేస్తే... ఆమెను ఇంటికి పిలిపించి, పంచాయతీ చేశారని మండిపడ్డారు. రిషితేశ్వరి కేసులో దోషులను ఇంకా శిక్షించలేదని అన్నారు. పదేపదే చట్టాలను ఉల్లంఘించే వారిని వెనకేసుకు రావడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు.

  • Loading...

More Telugu News