: కేసీఆర్ కు అంత దమ్ము లేదు: బీసీ సంఘాల అధ్యక్షుడు


విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ జాప్యం వెనుక పెద్ద కుట్ర దాగుందని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ఈ జాప్యం వల్ల పేద విద్యార్థులకు విద్య దూరం అవుతోందని అన్నారు. అయితే, ఫీజు రీయింబర్స్ మెంటును ముఖ్యమంత్రి కేసీఆర్ రద్దు చేయలేరని... ఆయనకు అంత ధైర్యం లేదని వ్యాఖ్యానించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య హామీ కూడా అమలు కాలేదని మండిపడ్డారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని చెప్పారు. ఈ నెల 21న విద్యారంగ సమస్యలపై తలపెట్టిన విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలని విన్నవించారు.

  • Loading...

More Telugu News