: నిజ జీవితంలోనూ 'బజరంగీ భాయిజాన్' అవతారమెత్తిన సల్మాన్ ఖాన్
ఓ చిన్నారిని పాకిస్థాన్ లో ఉన్న ఆమె కుటుంబంతో కలిపే కథాంశంతో వచ్చిన 'బజరంగీ భాయిజాన్' ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా విజయంతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు సల్మాన్ ఖాన్. సినిమాలతోనే కాదు, తన 'బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్' సేవా కార్యక్రమాలతోనూ సల్మాన్ ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో, రియల్ లైఫ్ లోనూ 'బజరంగీ భాయిజాన్' అవతారమెత్తాడు. ఇంటి నుంచి పారిపోయిన నలుగురు చిన్నారులను మళ్లీ వారి కుటుంబాలతో కలిపాడు. ఈ ప్రక్రియలో సల్మాన్ కు అంతర దేశాయ్ అనే సామాజిక కార్యకర్త సహాయపడ్డారు. మహారాష్ట్రలోని కర్జాత్ పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగించారు. ఇలాంటి కార్యక్రమాలే మరిన్ని చేపడతామని అంతర తెలిపారు. ఎంతోకాలంగా ఖర్చులన్నీ సల్మానే భరిస్తున్నారని, ఆయన నిజంగానే 'బజరంగీ భాయిజాన్' అని కొనియాడారు.