: దుప్పట్లో దూరి కాటేసిన పాము
అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉరవకొండ మండలం పెదముష్టూరులోని ఓ ఇంటి ఆవరణలో నిద్రపోతున్న సమయంలో దుప్పట్లో దూరిన నాగుపాము సంతోష్ (6), నవీన్ (4), దిలీప్ (8), హర్షవర్ధన్ (ఏడాది)లను కాటేసింది. పాము కాటుతో చిన్నారులు అరవడంతో నిద్రలేచిన పెద్దలు దానిని మట్టుబెట్టి, వారిని హుటాహుటీన ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పాము కాటు విరుగుడు మందు లేకపోవడంతో చిన్నారుల పరిస్థితి విషమించింది. దీంతో వారిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాలల పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.