: 'షార్' కేంద్రంలోకి చొరబడ్డ ఆగంతుకుడు
శ్రీహరికోటలోని భారత రాకెట్ ప్రయోగ కేంద్రం 'షార్'లోకి ఓ ఆగంతుకుడు చొరబడటం అంతుబట్టకుండా ఉంది. అత్యంత పటిష్టమైన భద్రత గల షార్ లోకి అనుమతి లేకుండా ప్రవేశించడం అసాధ్యం. అలాంటిది 25 ఏళ్ల వయసున్న ఓ యువకుడు లోపలికి వెళ్లాడు. 2వ మెయిన్ గేటు వద్ద ఆ యువకుడిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని, సూళ్లూరుపేట పోలీసులకు అప్పగించారు. షార్ లోకి చొరబడిని ఆ ఆగంతుకుడు ఉగ్రవాదా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఎంతో భద్రత గల షార్ కేంద్రంలోకి భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఆ యువకుడు వెళ్లడం ప్రకంపణలు సృష్టిస్తోంది.