: భారత ఆటగాళ్లేమీ సచిన్లు, ద్రావిడ్లు కాదు: ఏంజెలో మాథ్యూస్


ఇప్పుడున్న భారత బ్యాట్స్ మెన్ సచిన్లు, ద్రావిడ్లు కారని, స్పిన్ ఆడడంలో వారికి పరిమితులున్నాయని శ్రీలంక సారథి ఏంజెలో మాథ్యూస్ వ్యాఖ్యానించాడు. స్పిన్ ఆడే విషయంలో దిగ్గజాలతో వారిని పోల్చలేమని పేర్కొన్నాడు. అయితే, స్పిన్నర్లను ఎలా ఆడాలో భారత బ్యాట్స్ మెన్ నిలకడ మీద నేర్చుకుంటారని కచ్చితంగా చెప్పగలనని అన్నాడు. ప్రస్తుత భారత జట్టులోని ఏ ఒక్క ఆటగాడినీ సచిన్, ద్రావిడ్ తో పోల్చలేమని అన్నాడు. భారత యువ బ్యాట్స్ మెన్ ను సచిన్, ద్రావిడ్ తో పోల్చడమంటే, లంక జట్టులోని కుర్రాళ్లను మహేల, సంగక్కరలతో పోల్చినట్టుంటుందని మాథ్యూస్ అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News