: బీహార్ లో మారుతున్న సమీకరణాలు... బీజేపీలో చేరిన జేడీ(యూ) రెబెల్స్
బీహార్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ ప్యాకేజి (రూ.1.25 లక్షల కోట్లు) ప్రకటించిన మరుసటి రోజే ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నలుగురు జేడీ (యూ) రెబెల్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. గయనేంద్ర సింగ్ గయాను, రాజేశ్వర్ రాజ్, దినేశ్ కుశ్వాహ, సురేశ్ చంచల్ బుధవారం కేంద్రం మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ, బీజేపీ రాష్ట్ర చీఫ్ మంగళ్ పాండే సమక్షంలో కాషాయతీర్థం పుచ్చుకున్నారు. గయనేంద్ర సింగ్ ఏడాది క్రితం వరకు సీఎం నితీశ్ కుమార్ కు సన్నిహితుడిగా మెలిగారు. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ సింగ్ ను సస్పెండ్ చేశారు. కాగా, మరికొందరు జేడీ (యూ) ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు.