: తెలంగాణ సీఎస్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేశాం: ఏపీ డీజీపీ
అప్పా డీఐజీగా ఉన్న ఏపీ కేడర్ అధికారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ దూషించడంపై గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశామని ఏపీ డీజీపీ జేవీ రాముడు తెలిపారు. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేలా తెలంగాణ సీఎస్ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. దీనికితోడు, మరో 15 రోజుల్లో విజయవాడలో డీజీపీ క్యాంప్ ఆఫీస్ సిద్ధమవుతుందని చెప్పారు. పోలీసు శాఖకు చెందిన వివిధ భవనాల నిర్మాణాలకు వివిధ ప్రాంతాల్లో 3,300 ఎకరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. నూతన భవనాల కోసం రూ. 7 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారు.