: తనకు పుట్టగతులు ఉండవనే జగన్ రాష్ట్రపతిని కలిశారు: మంత్రి ఉమా
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి కలవడంపై ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పట్టిసీమ పూర్తయి రాయలసీమ, పులివెందులకు నీళ్లొస్తే తనకు పుట్టగతులు ఉండవనే జగన్ రాష్ట్రపతిని కలిశారని మండిపడ్డారు. తన విశేషాధికారాలతో పట్టిసీమ ప్రాజెక్టును నిలిపివేయాలని జగన్ రాష్ట్రపతిని కోరడం వాస్తవం కాదా? అని ఉమ మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు.