: భూ సేకరణపై మరోసారి పవన్ ట్వీట్... భూసేకరణ చట్టం ప్రయోగించొద్దని బాబుకు విజ్ఞప్తి


నవ్యాంధ్ర రాజధాని ప్రాంతాల్లో ఏపీ ప్రభుత్వం భూసేకరణ చేపట్టబోతుండటంపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ట్విట్టర్ లో స్పందించారు. సారవంతమైన, పలు రకాల పంటలు పండే ఉండవల్లి, పెనుమాక, బేతపూడి, ఇతర నదీముఖ గ్రామాల్లో పంట భూములను భూసేకరణ చట్టం కింద స్వాధీనం చేసుకోవద్దని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నట్టు పవన్ తెలిపారు. తక్కువ నష్టంతో అభివృద్ధి జరిగేలా పాలకులు వివేచనతో ఆలోచించాలని సూచించారు. దేశం ఏదైనా, పాలకులు ఎవరైనా ఒక ప్రాంత అభివృద్ధికి మాత్రమే పాటుపడవద్దన్నారు. అలా జరిగితే వాతావరణ కాలుష్యం, స్థానిక స్థానభ్రంశంతో పాటు ఇతర సమూహాల ఆగ్రహానికి గురి కావల్సి ఉంటుందని పవన్ పేర్కొన్నారు. అందుకే రాజధాని ప్రాంతంలో ఇష్టంలేని రైతుల భూములపై భూమి సేకరణ చట్టం ఉపయోగించవద్దని టీడీపీ ప్రభుత్వానికి విన్నవిస్తున్నానని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News