: ఏజెంట్ల మాయలో పడొద్దు... గల్ఫ్ కు వెళ్లొద్దు: కరీంనగర్ జిల్లా వాసులకు కవిత సూచన


మెరుగైన ఉపాధిని చూపుతామని పేర్కొంటూ అరచేతిలో వైకుంఠం చూపే గల్ఫ్ ఏజెంట్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలని నిజామాబాదు ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లావాసులకు సూచించారు. ఏజెంట్ల మాయమాటలు నమ్మి గుడ్డిగా గల్ఫ్ విమానాలు ఎక్కొద్దని కూడా ఆమె సూచించారు. నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆమె కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ఏజెంట్ల మాయలపై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నిర్ణీత జనాభా ఉన్న గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News