: నటుడు హృతిక్ రోషన్ తో డేటింగ్ తిరస్కరించారని ఆరోపిస్తూ కోకా కోలాపై కోర్టుకు వెళ్లిన మహిళ


బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తో డేటింగును తిరస్కరించిన వ్యవహారంలో 34 ఏళ్ల శిఖా మోగా అనే మహిళ ముంబయి స్థానిక కోర్టును ఆశ్రయించింది. 15ఏళ్ల కిందట హృతిక్ తొలి చిత్రం 'కహో నా ప్యార్ హై' విడుదల సమయంలో చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా కోకా కోలా సంస్థ ఓ పోటీ నిర్వహించింది. అందులో పాల్గొని విజేతలైన వారు హృతిక్ తో డేటింగుకు వెళ్లవచ్చంటూ ప్రకటించింది. పోటీలో నాడు కళాశాల విద్యార్థిని అయిన హర్యానాలోని పంచకులకు చెందిన శిఖా గెలుపొందింది. కానీ హృతిక్ ను ఆమె కలిసేందుకు ఇచ్చిన హామీని కోలా సంస్థ తిరస్కరించింది. అందుకు బదులుగా రూ.5 లక్షలు ఇస్తామని కూడా శిఖాకు ఆఫర్ చేసినా ఆమె నిరాకరించింది. హృతిక్ తో డేటింగ్ చాన్స్ విషయాన్ని తాను అందరితోనూ చెప్పుకున్నానని, దీని వల్ల సమాజంలో తన పరువుకు భంగం కలిగిందని ఆరోపిస్తూ శిఖా తాజాగా కోలా కంపెనీపై 2.5 కోట్ల నష్టపరిహార దావా వేసింది.

  • Loading...

More Telugu News