: సొంత ఇలాకాలో చంద్రబాబుకు నిరసన సెగ...కుప్పం గెస్ట్ హౌస్ ముందు ఎమ్మార్పీఎస్ ధర్నా


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి తన సొంత నియోజకవర్గం కుప్పంలోనే నిరసన సెగలు తగిలాయి. సొంత నియోజకవర్గ పర్యటనకు నిన్న కుప్పం చేరుకున్న చంద్రబాబు రాత్రి అక్కడి ప్రభుత్వ అతిథి గృహంలో బస చేశారు. నేడు కూడా ఆయన కుప్పంలోనే పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నేటి ఉదయం ఆయన పర్యటన మొదలు కాకముందే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) కార్యకర్తలు చంద్రబాబు బస చేసిన గెస్ట్ హౌస్ ముందు నిరసనకు దిగారు. ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే తేరుకున్న చంద్రబాబు భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసులు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి తరలించారు.

  • Loading...

More Telugu News