: ఉండమంటారా?... వెళ్లమంటారా?: రఘువీరాను నిలదీసిన ఆనం వివేకా
కాంగ్రెస్ పార్టీ నేత ఆనం వివేకానంద రెడ్డి ఏం చేసినా సంచలనమే. ఆయన నోటి నుంచి వెలువడే ప్రతి మాటా తూటానే. నిన్న హైదరాబాదులోని ఏపీసీసీ కార్యాలయం ఇందిరా భవన్ కు వచ్చిన ఆయన ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. తమ సొంత జిల్లా నెల్లూరుకు చెందిన కాంగ్రెస్ అనుబంధ విభాగాల నియామకాలను చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన నేతల సూచనల మేరకు ఎలా ఖరారు చేస్తారని ఆయన రఘువీరాను నిలదీశారు. వెెంటనే సదరు కమిటీలను రద్దు చేయాలని ఆయన రఘువీరాను కోరారు. తమ ఇలాకాలో వేరే ప్రాంతాల నేతల సూచనలు అమలు చేస్తే, తాము పార్టీలో ఉండాలా? బయటకెళ్లాలా? అని కూడా రఘువీరాతో ఆయన నిష్ఠూరమాడారు.