: చీప్ లిక్కర్ తాగితే ఆరోగ్యాలు పాడుకావా?: కేసీఆర్ పై నాగం ఫైర్


టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ సీనియర్ నేత, తెలంగాణ బచావో మిషన్ వ్యవస్థాపకులు నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. గుడుంబా వాడకాన్ని అరికట్టడానికి చీప్ లిక్కర్ ను భారీ ఎత్తున మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని... చీప్ లిక్కర్ తాగితే పేదల ఆరోగ్యాలు పాడు కావా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ఎంత సేపూ తన గురించి, తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నారని... ఏడాదిలో మూడు సార్లు తన కాన్వాయ్ ని మార్చారని దుయ్యబట్టారు. మిగులు బడ్జెట్ తో సంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణను పేద రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ దే అని విమర్శించారు. చివరకు స్థానికతను కూడా వివాదం చేసి, లబ్ధి పొందే యత్నం చేస్తున్నారని అన్నారు. సెక్రటేరియట్ ను కూల్చి బుర్జ్ ఖలీఫా లాంటి ఎత్తైన భవనాలు నిర్మిస్తామంటున్న కేసీఆర్... సంక్షేమ పథకాలకు నిధుల కోత పెట్టి, పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News