: ప్రియురాలిని పెళ్లాడిన దినేష్ కార్తీక్, రేపు మరోసారి వివాహం!
ఇండియన్ క్రికెటర్ దినేష్ కార్తీక్, ప్రముఖ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ వివాహం సంప్రదాయ క్రైస్తవ పద్ధతిలో ఘనంగా జరిగింది. మంగళవారం నాడు జరిగిన ఈ వేడుకలకు వరుడు, వధువు తరపు కుటుంబాలతో పాటు కొద్ది మంది స్నేహితులు హాజరయ్యారు. తెలుపు రంగు గౌన్ ధరించి వచ్చిన దీపిక మెరిసిపోయింది. కాగా, రేపు ఈ ఇద్దరూ తెలుగు నాయుళ్ల సంప్రదాయంలో మరోసారి వివాహం చేసుకోనున్నారు. దాదాపు రెండేళ్ల క్రితం చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా తొలుత హిందూ సంప్రదాయ పద్ధతిలో తాంబూలాలు మార్చుకున్న రెండు కుటుంబాలు, ఆపై క్రిస్టియన్ పద్ధతిలో నిశ్చితార్థం చేసుకున్నారు.