: నేడు సువ్రా ముఖర్జీ అంత్యక్రియలు... హాజరవుతున్న బంగ్లా ప్రధాని
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ అంత్యక్రియలు నేడు ఢిల్లీలోని లోధీ రోడ్ శ్మశాన వాటికలో జరగనున్నాయి. అంత్యక్రియలకు సువ్రా దగ్గరి స్నేహితురాలు, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హాసీనా హాజరవుతున్నారు. ఇప్పటికే ఆమె ఢిల్లీ చేరుకున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు. మంత్రి సుష్మాస్వరాజ్ ఈ ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో బంగ్లా ప్రధానికి సాదర ఆహ్వానం పలికారని తెలిపారు. ఎయిర్ పోర్ట్ లో సుష్మా, హసీనా కలసి ఉన్న ఫోటోను కూడా విదేశాంగ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. నిన్న (మంగళవారం) సువ్రా ముఖర్జీ మరణ వార్త తెలిసిన వెంటనే ప్రణబ్ కు షేక్ హసీనా ఫోన్ చేసి పరామర్శించారు. కాగా అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సుష్మ సహా పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు.