: భవిష్యత్ ప్రపంచ కార్ఖానా భారతే... చైనా సర్కారీ పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ వెల్లడి


ప్రపంచంలోనే వస్తూత్పత్తిలో చైనాదే అగ్రస్థానం. ఈ కారణంగానే ఆ దేశాన్ని ప్రపంచ కార్ఖానాగా పిలుస్తున్నాం. అయితే ఆ హోదా చైనా నుంచి భారత్ కు మారుతోందట. సమీప భవిష్యత్తులోనే భారత్ ప్రపంచ కార్ఖానాగా అవతరించబోతోంది. ఈ విషయాన్ని వేరే ఎవరైనా చెబితే, అంతగా ప్రాధాన్యముండేది కాదేమో. సాక్షాత్తు ప్రపంచ కార్ఖానా హోదాలో ఉన్న చైనా దేశానికి చెందిన అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. చైనా ఆర్థిక వ్యవస్థ జోరు తగ్గడంతో చైనాకు చెందిన కంపెనీలు కూడా విదేశాల బాట పడుతున్నాయి. ఈ తరహా చైనా కంపెనీలు ఆసక్తి చూపుతున్న దేశాల జాబితాలో భారత్ అగ్రభాగాన ఉంది. భారత్ లో మార్కెట్ శరవేగంగా దూసుకుపోతున్న క్రమంలోనే తమ దేశ కంపెనీలు ఆ దేశంవైపు చూస్తున్నాయని ఆ పత్రిక వెల్లడించింది.

  • Loading...

More Telugu News