: సరికొత్త రైలు బోగీల్లో ఉండే ఆధునిక సదుపాయాలివే!
అత్యాధునిక సౌకర్యాలతో తయారైన రైలు బోగీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు, ఆహ్లాదకర ప్రయాణ అనుభూతిని కల్పించడమే లక్ష్యంగా చెన్నైలోని ఐసీఎఫ్ (ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ)లో తయారైన ఏసీ 3 టైర్ బోగీలను అధికారులు ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాలు జరిగినా, అంటుకోని పదార్థాలతో ఈ బోగీలను తయారు చేశారు. సీసీటీవీ కెమెరాలు, బయో టాయ్ లెట్ల ఏర్పాటు ఈ బోగీల స్పెషల్. అంధుల కోసం బ్రెయిలీ లిపిలో ఉన్న స్టిక్కర్లనూ ఏర్పాటు చేశారు. కాగా, ఈ బోగీ ఐసీఎఫ్ లో తయారైన 50 వేలవ బోగీ అని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో అన్ని బోగీలనూ ఇదే తరహా ఆధునిక సాంకేతికతతో తయారు చేయనున్నట్టు వివరించారు.