: ‘గల్లా’పై సీఎం రమేశ్ దే పైచేయి... ఒలింపిక్ సంఘాల ఎన్నికలపై హైకోర్టు తీర్పు


ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీఎం రమేశ్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డిలను గుర్తిస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నిన్న తీర్పు చెప్పింది. రెండు రాష్ట్రాల ఒలింపిక్ అసోసియేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని ఉమ్మడి రాష్ట్ర ఒలింపిక్ సంఘాన్ని ఆదేశిస్తూ ఫిబ్రవరి 5న జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ ప్రేమ్ రాజ్, పురుషోత్తం నాయుడు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోస్లే తోసిపుచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు రెండు సమాంతర అసోసియేషన్లు ఇప్పటికే ఏర్పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఏపీ అసోసియేషన్ కు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ ల నేతృత్వంలో రెండు వేర్వేరు సంఘాలు ఏర్పడ్డాయి. అదే విధంగా తెలంగాణలోనూ జితేందర్ రెడ్డి, రంగారావుల నేతృత్వంలో రెండు సంఘాలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా రెండు రాష్ట్రాల్లోనూ ఆయా రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. గల్లా జయదేవ్, రంగారావుల తరఫున దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో సీఎం రమేశ్, జితేందర్ రెడ్డి ప్యానెళ్లకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లైంది.

  • Loading...

More Telugu News