: హలో రాజమౌళి గారూ... నేను కేసీఆర్ ను మాట్లాడుతున్నా!


ఏమిటీ...? తెలంగాణ సీఎం కేసీఆరేంటీ?, రాజమౌళికి ఫోన్ చేయడమేమిటీ? అనుకుంటున్నారా? నిజమండీ బాబూ... సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో సీఎం కేసీఆర్ స్వయంగా రాజమౌళికి ఫోన్ చేశారు. అయితే అవతల ఫోన్ లిఫ్ట్ చేేసిన వ్యక్తి టాలీవుడ్ హిట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాదులెండి. తన గ్రామాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కూసం రాజమౌళి సీఎం నుంచి వచ్చిన ఫోన్ కాల్ ను లిఫ్ట్ చేశారు. మొన్న గంగదేవిపల్లిలో సీఎం కేసీఆర్ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అదే రోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో స్వయంగా కేసీఆర్, రాజమౌళికి ఫోన్ చేశారు. ‘‘హలో రాజమౌళి గారు...నేను కేసీఆర్ ను మాట్లడుతున్నా. మీ గ్రామంలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి వచ్చాను కదా. జనం ఏం అనుకుంటున్నారు?’’ అని కేసీఆర్ ఆయనను అడిగారట. స్వయంగా సీఎం తనకు ఫోన్ చేయడంతో ఉబ్బితబ్బిబ్బైన రాజమౌళి, కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు. గంగదేవిపల్లికి రావడం సంతోషాన్నిచ్చిందని, గ్రామాభివృద్ధికి ఏ సహకారం కావాలన్నా ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News