: బాహుబలి బాలీవుడ్ సినిమా అయితే... యాక్టర్లు వీరేనట!


భారత సెల్యులాయిడ్ పై ఓ దృశ్యకావ్యం అనదగ్గ చిత్రం బాహుబలి. రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్న ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి ప్రభాస్. ప్రతినాయకుడు భల్లాలదేవగా రానా, కీలకమైన శివగామి పాత్రలో రమ్యకృష్ణ, అవంతికగా తమన్నా, దేవసేనగా అనుష్క, బిజ్జలదేవగా నాజర్, కాలకేయగా ప్రభాకర్ నటించారు. అయితే, ఇదే సినిమా బాలీవుడ్ లో నిర్మితమైతే ఎవరు యాక్టర్లు అయ్యుండేవారో సీఎన్ఎన్-ఐబీఎన్ ఓ కథనం వెలువరించింది. దాని ప్రకారం... బాహుబలిగా సల్మాన్ ఖాన్, భల్లాలదేవగా అజయ్ దేవగణ్, కట్టప్పగా నసీరుద్దీన్ షా, శివగామిగా విద్యా బాలన్, మహారాణి దేవసేనగా టబు, అవంతికగా కత్రినా కైఫ్, బిజ్జలదేవగా గోవింద్ నామ్ దేవ్, కాలకేయగా గుల్షన్ గ్రోవర్ అతికినట్టు సరిపోతారట. మరి, రాజమౌళి ఏమంటాడో?

  • Loading...

More Telugu News