: ఫోన్ ను హ్యాక్ చేసి వేధింపులకు దిగిన సహోద్యోగి!
కంప్యూటర్ ను హ్యాక్ చేసి అందులోని ఫోటోలు, డేటా తస్కరించడం గురించి విన్నాం. కానీ ఫోన్ ను హ్యాక్ చేయడం ఏంటి? ఎలా? అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే, ఫోన్ ను హ్యాక్ చేసి లైంగిక వేధింపులకు దిగాడో కాముకుడు. వివరాల్లోకి వెళ్తే... హర్యాణాలోని ఫరీదాబాద్ లో స్థానిక సంస్థలో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగి ఫోన్ ను సహోద్యోగి హ్యాక్ చేశాడు. ఆమె ఫోటోలు, డేటా తస్కరించిన సదరు వ్యక్తి, తనతో పాటు గడిపేందుకు రావాలని ఒత్తిడి చేశాడు. అతని ప్రతిపాదన తిరస్కరించడంతో ఆమె ఫోన్ నుంచి తస్కరించిన ఫోటోలను ఇంటర్నెట్ లో పెడతానని బెదిరింపులకు దిగాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.