: ఆనందం కోసం వెళ్లిన ఎంపీ కొడుకుని నిలువుదోపిడీ చేశారు!
ఆనందం కోసం అర్రులు చాచిన ఓ ఎంపీ కుమారుడు చివరికి ఇబ్బందుల్లో పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ కు చెందిన ఎంపీ కుమారుడు, ముంబైలోని శాంతాక్రజ్ లో ఓ బ్రోకర్ ను సంప్రదించి, కాల్ గర్ల్ కోసం బేరం కుదుర్చుకున్నాడు. బేరం ప్రకారం ఎంపీ కుమారుడు చెప్పిన అడ్రస్ కు సదరు కాల్ గర్ల్ కారులో చేరుకుంది. అనంతరం ఆమెను దింపేందుకు వచ్చిన డ్రైవర్ తో కలిసి ఎంపీ కుమారుడిని కత్తితో బెదిరించి, 1.5 లక్షల రూపాయలు దోచుకెళ్లిపోయింది. దీంతో సదరు ఎంపీ కుమారుడు లబోదిబోమంటూ వకోలా పోలీసులను ఆశ్రయించాడు. తాను సంప్రదించిన బ్రోకర్ ద్వారా వారిని పట్టుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.