: కట్నం అడిగిన వారంతా దేశద్రోహులే: అమల


కట్నం అడిగిన వారంతా దేశ ద్రోహులు, మహిళా ద్రోహులని సినీ నటి, బ్లూక్రాస్ సోసైటీ చైర్ పర్సన్ అమల అక్కినేని అన్నారు. హైదరాబాదులోని ఎల్బీనగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, మహిళలు సామాజిక, ఆర్థిక స్వావలంబన సాధించి, దేశానికి గర్వకారణంగా నిలవాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలు చేయమని మహిళల నుంచి ఆమె హామీ తీసుకున్నారు. బాలికా విద్య తప్పనిసరి అని చెప్పిన అమల, స్త్రీ, పురుషుల మధ్య తేడా చూపించవద్దని, బాలికలను తక్కువగా చూడవద్దని సూచించారు. మహిళలు కోడలుగా మరో మహిళను తెచ్చుకుంటున్నప్పుడు కట్నం అడగవద్దని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆమె పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News