: కేన్సర్ రోగుల పాలిట కాఫీ దివ్యౌషధం!
కేన్సర్ రోగుల పాలిట కాఫీ దివ్యౌషధంలా పనిచేస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. రోజూ ఒక కప్పు కాఫీ తాగడం మంచిదేనని పలువురు వైద్యులు చెబుతూ ఉంటారు. అదే సమయంలో పేగు కేన్సర్ ఉన్నవాళ్లు, కీమో థెరపీ చికిత్స తీసుకుంటున్నవారు రోజూ నాలుగు కప్పుల కాఫీ తాగడం ఆరోగ్యకరం అని నిపుణులు సూచిస్తున్నారు. పేగు కేన్సర్ కి చికిత్స తీసుకుంటున్న రోగులపై కెఫిన్ తో కూడిన కాఫీపై పరిశోధకులు విస్తృత పరిశోధనలు నిర్వహించారు. పరిశోధనల్లో భాగంగా పేగు క్యాన్సర్, కీమో థెరపీ చేయించుకుంటున్న 100 మంది రోగులతో రోజుకి నాలుగు కప్పుల (460 ఎంఎల్) కాఫీని తాగించారు. కాఫీ తాగే వారిలో 42 శాతం మందికి కేన్సర్ నుంచి ఉపశమనం లభించినట్టు పరిశోధకులు వెల్లడించారు. కాఫీలో ఉండే కొన్ని పదార్థాలు కేన్సర్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు పరిశోధకులు తెలిపారు. కాఫీ తాగడం ద్వారా పేగు, బ్రెస్ట్, మెలనోమా, లివర్ కేన్సర్ లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పరిశోధకులు స్పష్టం చేశారు.