: రేవంత్ రెడ్డి నాకు మంచి మిత్రుడు... అన్ని ప్రశ్నలకు జవాబిచ్చా: డీకే శ్రీనివాసులు


ఓటుకు నోటు కేసులో రాజకీయనేత, పారిశ్రామికవేత్త డీకే ఆదికేశవులునాయుడు తనయుడు శ్రీనివాసులునాయుడుకు తెలంగాణ ఏసీబీ నోటీసులు పంపడం తెలిసిందే. ఆ మేరకు ఆయన మంగళవారం విచారణకు హాజరయ్యారు. విచారణ ముగిసిన అనంతరం శ్రీనివాసులునాయుడు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడని తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉందా? అని అధికారులు ప్రశ్నించారని వెల్లడించారు. విచారణలో దర్యాప్తు అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబిచ్చానని చెప్పారు. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి విష్ణు చైతన్య కూడా విచారణకు హాజరవుతారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News