: అభిమానుల ప్రశ్నలకు మహేష్ బాబు ఫేస్ బుక్ లో ఇచ్చిన సమాధానాలు ఇవిగో!
'శ్రీమంతుడు' చిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో హీరో మహేష్ బాబు ఈరోజు తన ఫేస్ బుక్ లో నిర్వహించిన లైవ్ చాట్ లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. చాలామంది మహేష్ కొడుకు గౌతమ్, కూతురు సితారల గురించే అడగటం విశేషం. అలా అభిమానులకు మహేష్ చెప్పిన సమాధానాల్లో కొన్నింటిని చూద్దాం. 1.ప్రశ్న: మహేష్ గారు! దర్శకత్వం చేయాలన్న ఆసక్తి మీకు ఉందా? జవాబు: ఇప్పుడు మాత్రం కాదు... 2.ప్రశ్న: మహేష్ సర్! 'శ్రీమంతుడు'లో మీ డాటర్ కు ఇష్టమైన పాట ఏది? జవాబు: తనకు 'రామ రామా...' అంటే ఇష్టం, ఆ పాటలో నేను డ్యాన్స్ చేసినట్టుగానే తను కూడా చేస్తుంది! 3. ప్రశ్న: 'శ్రీమంతుడు' కథ విన్న వెంటనే మీ స్పందన ఏంటి? జవాబు: చాలా బలమైన, శక్తిమంతమైన కథ.. ఇంతకుముందు నేనెప్పుడూ చేయనిది హర్ష పాత్ర 4.ప్రశ్న: మీ సినిమాల్లో కృష్ణగారి ఫేవరెట్ చిత్రం ఏది? జవాబు: ఈ రోజుకి మాత్రం 'శ్రీమంతుడు' 5.ప్రశ్న: ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో ఎవరు? జవాబు: ఇప్పుడు, ఎప్పుడూ మా నాన్నగారే! 6.ప్రశ్న: 'శ్రీమంతుడు' తరువాత మీ తదుపరి చిత్రం ఏంటి సర్? జవాబు: బ్రహ్మోత్సవం 7.ప్రశ్న: మీ కూతురు మీ సినిమాలను చూడటం ప్రారంభించిందా? జవాబు: అవును, తను 'శ్రీమంతుడు' రెండుసార్లు చూసింది 8.ప్రశ్న: ఈ చిత్రంలో మీ ఫేవరెట్ సన్నివేశం ఏంటి? జవాబు: క్లైమాక్స్ కు ముందు నా తండ్రి జగపతిబాబుగారితో వచ్చే భావోద్వేగ సన్నివేశం 9.ప్రశ్న: మీ కుటుంబం 'శ్రీమంతుడు' చిత్రాన్ని ఎన్నిసార్లు చూసింది? జవాబు: గౌతమ్, నమ్రతా 7 సార్లు చూశారు 10.ప్రశ్న: సర్, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? జవాబు: హైదరాబాద్ బిర్యానీ 11.ప్రశ్న: మీ అబ్బాయి గౌతమ్ నటించిన మొదటి చిత్రానికే అవార్డు వచ్చినందుకు ఎలా భావిస్తున్నాడు? జవాబు: చాలా చాలా సంతోషంగా ఉన్నాడు 12.ప్రశ్న: సార్, నాది పాకిస్థాన్... మీకు పెద్ద అభిమానిని సర్. పాక్ లో కూడా మీకు చాలా మంది అభిమానులున్నారు. అందుకే మీ సినిమాల హిందీ వెర్షన్ డబ్బింగ్ ను ఇక్కడ కూడా రీలీజ్ చేయవచ్చు కదా? జవాబు. థాంక్యు. ఈసారి తప్పకుండా ఈ విషయాన్ని పరిశీలిస్తాం. 13.ప్రశ్న: 'శ్రీమంతుడు'లో మీకు, శ్రుతి హసన్ కు మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఒక్క మాటలో తన గురించి... జవాబు: తనొక అద్భుతమైన నటి! 14.ప్రశ్న: హాయ్ మహేష్ గారు... చిన్న బడ్జెట్ చిత్రాల్లో మీరెందుకు నటించడంలేదు? జవాబు: మంచి స్క్రిప్ట్ తో వస్తే తప్పకుండా చేస్తాను 15. ప్రశ్న: మీ నటనకు నేను పెద్ద అభిమానిని. దాన్నుంచి మీరేం నేర్చుకున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా? జవాబు: ప్రతి స్క్రిప్టు నాకు కొత్త విషయాలు నేర్పుతుంది... అదొక నిరంతర ప్రయాణం 16.ప్రశ్న: నాలాగే చాలా మంది మిమ్మల్ని స్పూర్తిగా తీసుకోవాలంటే ఎలాంటి సందేశం ఇస్తారు? జవాబు: మీ మనసు చెప్పింది వినండి. మీ కల తప్పకుండా నెరవేరుతుంది 17.ప్రశ్న: మీ ఫేవరెట్ హాలిడే స్పాట్? జవాబు: సింగపూర్ 18.ప్రశ్న: ప్రతి కుటుంబం మిమ్మల్ని వారిలో వ్యక్తిగా ట్రీట్ చేస్తుంది. దాన్ని మీరెలా భావిస్తారు? జవాబు: చాలా గర్వంగా ఉంటుంది. అందుకు అందరికీ కృతజ్ఞతలు 19.ప్రశ్న: అవార్డులపై మీ అభిప్రాయం ఏంటి? జవాబు: ప్రతి ఒక్క నటుడు అవార్డు తీసుకోవడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే వారి నటనకు వచ్చిన ప్రశంస కాబట్టి! 20.ప్రశ్న: 'శ్రీమంతుడు' సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేస్తున్నావ్ అన్నయ్యా? జవాబు: నిజంగా చెబుతున్నా, ఆనందంలో మునిగితేలడం లేదు. కానీ, మంచిగా ఫీల్ అవుతున్నా 21.ప్రశ్న: ఖాళీ సమయంలో అభిమానుల ట్వీట్లను చదువుతారా? జవాబు: తప్పకుండా చదవుతాను 22.ప్రశ్న: మీ ఫేవరెట్ పుస్తకం? జవాబు: ఎక్ హార్ట్ టెల్లె రాసిన 'ఏ న్యూ ఎర్త్' 23.ప్రశ్న: ఓ సెలబ్రిటీ కావడం వల్ల మీకు ఇష్టమైన దాన్ని దేన్నయినా పొందలేకపోతున్నారా? జవాబు: దేని పరిమితులు దానివి. కానీ నేనేం చేస్తున్నానో దాన్నే ప్రేమిస్తా. ఇప్పుడు చేస్తున్న దానికి మించి నా లైఫ్ ను మరోచోట ఊహించలేను! 24.ప్రశ్న: కొరటాల శివగారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? జవాబు: అమేజింగ్ ఎక్స్ పీరియన్స్ 25.ప్రశ్న: మీ అమ్మాయి సితారతో కలసి 'భజరంగీ భాయిజాన్' లాంటి సినిమాను తెలుగులో మీరు కూడా చేయాలి...! జవాబు: చిన్న నవ్వు...