: 'బీహార్ కు స్పెషల్ ప్యాకేజీ'పై రాహుల్ మండిపాటు


ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్న బీహార్ కు ప్రధాని మోదీ స్పెషల్ ప్యాకేజీ ప్రకటించడం ఎన్నికల స్టంట్ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. బీహార్ లో ఎన్నికల వేళ ఈ ప్యాకేజీ ప్రకటించడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో సులువుగానే అర్థం చేసుకోవచ్చని అన్నారు. మోదీ మాటలు నమ్మొద్దని ఆయన సూచించారు. ఇంతకుముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. హామీలు ఇవ్వడమే తప్ప అమలు చేయడం మోదీకి తెలియదని ఎద్దేవా చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పర్యాయం విజయం సాధించాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉందన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News