: నిన్న రాష్ట్ర హోం మంత్రి, నేడు ప్రతిపక్ష నేత...పాక్ లో పేట్రేగుతున్న ఉగ్రవాదులు
పాకిస్థాన్ లో రాజకీయ నాయకులే ఉగ్రవాదుల లక్ష్యంగా మారారు. నాలుగు రోజుల క్రితం పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్ర హోం మంత్రిపై బాంబు దాడికి పాల్పడిన ఉగ్రవాదులు, ఆ ఘటన మర్చిపోక ముందే పాక్ ప్రతిపక్ష నేత అబ్దుల్ రషీద్ గోడిల్ పై దాడికి దిగారు. కరాచీలో ఆయన తన కారులో కూర్చుని ఉండగా, గుర్తుతెలియని ఆగంతుకులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కారు డ్రైవర్ మృతి చెందగా, అబ్దుల్ రషీద్ గోడిల్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ముత్తహిదా ఖయామీ మూవ్ మెంట్ (ఎంక్యూఎం) పార్టీకి చెందిన అగ్రనేతల్లో రషీద్ ఒకరు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారని డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ మునీర్ షేక్ చెప్పారు.