: రాయ్ బరేలీ జైలులో పోలీసులపై ఖైదీల దాడి
ఉత్తరప్రదేశ్ లో జైలులోని ఖైదీలు పోలీసులపై దాడులకు దిగారు. రాయ్ బరేలీ జైలులో ఖైదీలకు పలు సౌకర్యాలు అందుతున్నాయన్న ఆరోపణల నేపధ్యంలో జైలు అధికారులు తనిఖీలు చేపట్టారు. దీంతో జైలులోని ఖైదీలు జైలర్ ధీరజ్ షా, ఉప జైలర్ శైలేంద్ర, పోలీసులపై దాడులకు దిగారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అదనపు బలగాలను రంగంలోకి దించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాగా, గాయాలపాలైన జైలర్, ఉపజైలర్, పోలీసులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీంతో జైళ్ల శాఖ డీఐజీ కుల్ శ్రేష్ట జైలును సందర్శించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.