: భలే చాన్సు కొట్టేసిన భారత సాకర్ క్రీడాకారిణి


ప్రపంచంలోని కొన్ని దేశాలతో పోల్చితే భారత సాకర్ టీమ్ ర్యాంకింగ్స్ లో ఎక్కడో ఉంటుంది. మన సాకర్ ఆటగాళ్ల పేర్లు కూడా చాలామందికి తెలియవు. పురుషుల జట్టు విషయమే అలా ఉంటే, ఇక, మహిళల సాకర్ జట్టు పరిస్థితి ఎలా ఉంటుందో సులువుగానే అర్థం చేసుకోవచ్చు. అయితే, భారత్ లో ఐఎస్ఎల్ ప్రారంభం తర్వాత పరిస్థితి కొంత మార్పు వచ్చింది. విదేశీ ఆటగాళ్ల రాకతో స్వదేశీ ఆటగాళ్లలో నవ్యోత్సాహం తొణికిసలాడుతోంది. వారికి దీటుగా రాణించాలన్న తపన మనవాళ్లలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, భారత మహిళా సాకర్ క్రీడాకారిణి అదితి చౌహాన్ అద్భుతమైన అవకాశం దక్కించుకుంది. పేరుమోసిన ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ లో వెస్ట్ హామ్ మహిళల జట్టుకు ఆడేందుకు ఆమెకు ఆఫర్ వచ్చింది. ఈ మేరకు అదితి సదరు బ్రిటీష్ క్లబ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. 2013లో జరిగిన సౌత్ ఏషియన్ ఫుట్ బాల్ ఫెడరేషన్ కప్ ను భారత్ నెగ్గడంలో అదితి కీలకపాత్ర పోషించింది. తాజా ఒప్పందం ద్వారా, ఓ టాప్ ఇంగ్లీష్ క్లబ్ జట్టులో బెర్త్ దక్కించుకున్న తొలి భారత మహిళా ఫుట్ బాలర్ గా అవతరించింది.

  • Loading...

More Telugu News