: నియోజకవర్గ పర్యటనలో బిజీగా చంద్రబాబు... అనిమిగానిపల్లెలో సహపంక్తి భోజనం


సీఎం చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పం పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. మధ్యాహ్నం చిత్తూరు జిల్లాలోని అనిమిగానిపల్లెలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తరువాత గ్రామ సర్పంచ్ మునికృష్ణ ఇంట్లో దళితులతో చంద్రబాబు సహపంక్తి భోజనం చేశారు. అంతకుముందు కుప్పంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న బాబు ప్రసంగించారు. పించన్ల పంపిణీలో అవినీతికి తావు లేకుండా చూస్తున్నామన్నారు. ధరల నియంత్రణకు చర్యలు తీసుకుని కిలో ఉల్లిపాయలు రూ.20కే ఇస్తున్నట్టు చెప్పారు. పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి అండగా ఉంటామని బాబు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News