: మరో మైలురాయిని అధిగమించిన హోండా


హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ఇండియాలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. సంస్థ మార్కెటింగ్ చేస్తున్న 'యాక్టివా' స్కూటర్ల అమ్మకం కోటి యూనిట్లను దాటింది. ఫోర్ స్ట్రోక్ ఇంజన్, గేర్ లెస్ ట్రాన్స్ మిషన్ సదుపాయాలతో 2001లో మార్కెట్లోకి 'యాక్టివా' ప్రవేశించిన సంగతి తెలిసిందే. యాక్టివాను నమ్ముకున్న కోటి కుటుంబాలు ఇండియాలో ఉండటం తమకు గర్వకారణమని ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ కైటా మురమత్సు వ్యాఖ్యానించారు. ఓ దశాబ్ద కాలం క్రితం ఇండియాలో స్కూటర్లు అత్యధికంగా అమ్ముడవుతాయని ఎవరూ ఊహించలేదని, యాక్టివా దాన్ని సాధించిందని సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ యద్వీందర్ సింగ్ గులేరియా వివరించారు. కాగా, 2001-02 సంవత్సరంలో 55 వేల యూనిట్లు అమ్ముడైన యాక్టివా, గత ఆర్థిక సంవత్సరంలో 21 లక్షల యూనిట్లు అమ్ముడైంది. దేశవాళీ స్కూటర్ సెగ్మెంట్ లో ఇప్పుడు యాక్టివాదే అగ్రస్థానం.

  • Loading...

More Telugu News