: జగన్ శవ రాజకీయాలు మానుకోవాలి: మంత్రి గంటా


కడప జిల్లాలోని నారాయణ కళాశాల ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్యపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. జగన్ శవ రాజకీయాలు చేయడం తగదని సూచించారు. కడప ఘటన తన దృష్టికి రాగానే జిల్లా కలెక్టర్ తో మాట్లాడానన్నారు. ఆ ఘటనపై త్రిసభ్య కమిటీ వేశామని, మూడు రోజుల్లో నివేదిక వస్తుందని గంటా వెల్లడించారు. నివేదిక రాగానే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్రంలో వీసీల నియామకం చేపడతామన్నారు. ఏడు యూనివర్సిటీ వీసీల నియామకాలకు 1150 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. ఒంగోలులో ట్రిపుల్ ఐటీకి స్థలం చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. టీచర్ల బదిలీలకు ఎలాంటి ఇబ్బందులు లేవని, పనిచేసే వారిని ప్రోత్సహిస్తామని చెప్పారు. అందుకే బదిలీల్లో మెరిట్ ను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News