: సొంత చెల్లిని ఆ అన్నలు అత్యంత కిరాతకంగా నడిరోడ్డు మీద నరికేశారు!


ఉత్తరప్రదేశ్ లో పరువు హత్యలకు అంతులేకుండా పోతోంది. తాజాగా ఇద్దరు సోదరులు తమ సొంత చెల్లిని పాశవికంగా హత్యచేసిన ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే...షాజాన్ పూర్ జిల్లా పరౌరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బహమని గ్రామంలో 17 ఏళ్ల యువతికి 8 మంది అన్నదమ్ములు. వారిలో ఆరుగురు ఢిల్లీలో ఉంటుండగా, ఇద్దరు ఊళ్లోనే వుంటున్నారు. కాగా, వీరి చెల్లి మహ్మద్ అచ్చాన్ అనే దగ్గరి బంధువుతో ప్రేమలో పడింది. అది ఇష్టం లేని ఆమె సోదరులు గుల్ హుస్సేన్, నన్హిమియాలు, తల్లిదండ్రులు లేని సమయం చూసుకుని, నడి రోడ్డుపై యువతిని అత్యంత పాశవికంగా నరికిచంపారు. అనంతరం ఆడపిల్ల ప్రేమించకూడదని, కుటుంబాలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అక్కడ గుమికూడిన వారికి క్లాస్ కూడా పీకారు. తరువాత సోదరి మొండేన్ని రోడ్డుమీద వదిలేసి, తలను తీసుకుని వెళ్లిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఘటనతో సంబంధం లేని యువతి ప్రియుడు అచ్చాన్ ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నామని, కేసు దర్యాప్తు సాగుతోందని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News