: ఫస్ట్ టాటూ వేయించుకున్నానోచ్..: శిల్పాశెట్టి


బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తన శరీరంపై తొలిసారిగా పచ్చబొట్టును వేయించుకుందట. ఓ టాటూ ఆర్టిస్ట్ ఆమె చేతిపై పచ్చబొట్టు పొడుస్తున్న దృశ్యాన్ని శిల్పాశెట్టి తన 'ఇన్ స్టాగ్రామ్' వేదికపై పంచుకుంది. తన ఎడమచేతి మణికట్టుపై పవిత్రమైన 'స్వస్తిక్' చిహ్నాన్ని వేయించుకున్నానని, ఇది తన తొలి టాటూ అని శిల్ప సంబరంగా పోస్టింగ్ ను పెట్టింది. కాగా, ఇప్పటికే, దీపికా పదుకొనే, హృతిక్‌ రోషన్, ప్రియాంకా చోప్రా, అజయ్‌ దేవగణ్, అక్షయ్‌ కుమార్ తదితరులు తమ శరీరంపై టాటూలు వేయించుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News